తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలోనే బదులివ్వనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సభకు దూరంగా ఉన్న కేసీఆర్, ఈసారి తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం, డిజైన్లు, నిర్మాణం వంటి అన్ని అంశాల గురించి ఆయన సభలో వివరించనున్నారు. కేసీఆర్ సభకు హాజరైతేనే ప్రజల్లో ప్రభుత్వ వాదన నిజం కాదని చెప్పే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

