ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని జకర్తాలోని ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.జపనీస్ డ్రోన్ సంస్థ టెర్రా డ్రోన్ కార్పొరేషన్ బిల్డింగ్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. కాసేపటికే అవి భవనం మొత్తం వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 20 మంది మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

