రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉండగా ఇప్పుడు అవి విడుదల అవుతున్నాయి. తొలి విడత కింద ఇటీవల తెలంగాణ పంచాయతీలకు రూ.259.36 కోట్లను మోదీ సర్కార్ విడుదల చేసింది.తాజాగా రెండో విడత నిధులను కూడా రిలీజ్ చేసింది. రెండో విడతలో భాగంగా రూ.387 కోట్లని అందించింది. దీంతో రెండు విడతల్లో కలిపి మొత్తంగా రూ. 646.36 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

