గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోవడంపై నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రాలపై, క్లబ్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఇరుకైన ప్రవేశ మార్గం, తప్పించుకునే మార్గాలు లేకపోవడం, నిర్మాణంలో మండే స్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా ప్రాథమిక విచారణలో వెల్లడికావడంతో పోలీసులు తాజా చర్యలకు దిగారు.

