గోవా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ముందడుగు వేస్తూ కొత్త డ్రాఫ్ట్ పాలసీని విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా మార్చనున్నారు. ఈ డ్రాఫ్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం గోవాను టెక్నాలజీ ఆధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం. ప్రజలకు టెక్నాలజీ ప్రయోజనాలు అందేలా చేయడం, యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పడం ఈ పాలసీ లక్ష్యం. ఫైనాన్స్, టూరిజం, గవర్నెన్స్ వంటి విభాగాల్లో AI వినియోగాన్ని విస్తరించాలనే ప్రణాళిక ఉంది.

