బంగారం, వెండి ధరల ట్రెండ్ మారిపోయిందా? ప్రస్తుతం సీన్ అలాగే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ పడిపోయాయి. ఫిబ్రవరి 6న బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.2,070 తగ్గింది. రూ.1,54,350 నుంచి రూ.1,52,350కి చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1,900 తగ్గింది. రూ.1,41,550 నుంచి రూ.1,39,650కి చేరింది. కిలో వెండిపై రూ.20,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,00,000 నుంచి రూ.2,80,000కు చేరింది.

