ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తుందని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ డైరెక్టర్ వింగ్ కమాండర్ వెల్లడించారు. మార్చి 9, 10 తేదీలలో బాలికలకు., మార్చి 12,13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందని అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుండి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు

