గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య పార్టీకి చెందిన నాయకులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే గద్వాలలో మాత్రం రాజకీయ వ్యభిచారం నడుస్తుందని విమర్శించారు. బహుజన బిడ్డను అణగదొక్కడానికి కుయుక్తులు పన్నిన శక్తులపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. పూటకో మాట మార్చే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఎవరికి ఇంకా తెలియదని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాంలు అందజేయడం శోచనీయమని అన్నారు.

