ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థత అనిపించుకోదని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. “గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ, ఇరాన్‌పై జరిగిన దాడిని ఎందుకు విస్మరిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు.

