పురపోరులో క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 16న ఛైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందచేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
డిక్లరేషన్ నమూనాను ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ పంపించింది.

