ఉత్తర ప్రదేశ్‌లోని, వారణాసి పట్టణంలో ఉదయ్ ప్రతాప్ కాలేజ్ క్యాంపస్‌లో ఒక విద్యార్థిని తోటి విద్యార్థి పిస్టల్‌తో కాల్చి చంపాడు. మృతుడు, హంతకుడు ఇద్దరూ అదే కాలేజీలో చదువుతున్నారు. ఇరువురి మధ్యా నెలకొన్న వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సూర్య ప్రతాప్ సింగ్‌ను మంజీత్ చౌహాన్ పిస్టల్‌తో అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు, సిబ్బందిపై దాడి చేశారు ఇద్దరు అధ్యాపకులు గాయపడ్డారు.

