గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఉత్కంఠ మధ్య బెయిల్ మంజూరు అయిన తర్వాత కౌశిక్ రెడ్డి విడుదల అయ్యారు. బెదిరింపు కేసుపై సుమారు 4గంటల పాటు వాదనలు జరిగిన తర్వాత కాజీపేట రైల్వే కోడ్ జడ్జి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. దీంతో బీ అర్ ఎస్ శ్రేణులు ఆనందం మునిగాయి.

