తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి దశలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం, మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దిలా ఉండగా నిర్మల్, ఖానాపూర్, కాగజ్‌నగర్ వంటి పట్టణాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

