రైతు ఉత్సవాల బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సభావేదిక పైనుంచి రెండోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలి అని ఒక పెద్దమనిషి అంటున్నారు పాపాల భైరవుడు ఎందుకు రావాలో.. పార్టీ మారుతున్న పెద్దమనిషి చెప్పాలి..ఒక్కాయనకు పదవి రాకపోతే.. ప్రజాప్రభుత్వం పోవాలా? కేసీఆర్.. నీ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్. 2029లో నువ్వో.. నేనో తేల్చుకుందాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

