తెలంగాణను దోచుకున్న దొంగలు.. బిఆర్ఎస్ నేతలు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలే కవిత దోచుకున్నారని, మీ మీద వస్తున్న ఆరోపణలు నాటి హోం మంత్రిపై ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు మంత్రివర్గాన్ని ఒక డమ్మీ కేబినెట్ గా నడిపించారని, సిఎం రేవంత్ రెడ్డి కేబినెట్ పై అవాకులు.. చెవాకులు మాట్లాడితే ఊరుకోమని అద్దంకి హెచ్చరించారు

