కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

