ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తూ.. అమెరికా కూడా ఆదివారం రోజు ఇరాన్‌పై దాడి చేసింది. దీంతో ఇరాన్ సైతం అమెరికా స్థావరాలపై ప్రతి దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఖతార్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసింది. ఈక్రమంలోనే ఇజ్రాయెల్‌తో ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరింపజేశారని ఇరాన్ వివరిస్తోంది. ఈ దాడి అనంతరమే ఒప్పందం కోసం ట్రంప్ తమను ప్రాధేయ పడ్డారని పేర్కొంటోంది.

