కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉండడాన్ని అదును చూసుకుని స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్రమత్తమైన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ రికార్డులను, కోర్టు కేసులను పరిశీలించగా సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని, కోర్టుల్లో కేసులు కూడా లేవని తేలింది.

