లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మూడు ప్రశ్నలను లేవనెత్తారు. 1.ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) ఎందుకు తొలగించారు?. 2.2023 డిసెంబర్లో ప్రభుత్వం చట్టాన్ని (ఎన్నికల కమిషనర్లకు సంబంధించి) మార్చింది. ఎన్నికల కమిషనర్లుగా ఉన్నప్పుడు వారు తీసుకున్న ఏ చర్యకైనా శిక్ష పడకుండా ఉండేలా ఈ చట్టాన్ని ఎందుకు మార్చారు? 3.పోలింగ్ జరిగిన 45 రోజుల తర్వాత పోలింగ్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తీసుకొచ్చారు.

