తెలంగాణ జాతిపిత అంశంపై కేసీఆర్ కుటుంబం చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను జాతిపితగా పిలుచుకుంటామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లి గా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. అసలు ఏ ప్రాతిపదికన మిమ్మల్ని మీరు జాతిపితగా పిలుచుకుంటున్నారు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి, భార్యాభర్తల మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణలను కూడా విన్న మీకు జాతిపిత అని పిలిపించుకునే నైతిక హక్కు లేదని, ఈ పనులకు మీరు సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు.

