ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం నుంచి అసెంబ్లీ వర్గాలకు బుధవారం అధికారిక సమాచారం
అందింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.

