ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. రూ.2,540 కోట్లతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం రూ.798 కోట్ల ప్రణాళికతో పాటు ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతుల కోసం రూ.580 కోట్ల ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్‌కు భూమిని కేటాయించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

