రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను వేగంగా పయనిస్తూ, ఏపీలోని తీర జిల్లాలకు ముప్పుగా మారబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలి, మరికొన్ని గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 770 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని సమాచారం.

