ఆంధ్రాలో 2025 డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు ఓ రేంజ్లో పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 31 వరకు మొత్తం మద్యం అమ్మకాలు సుమారు రూ. 2,767 కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యేకంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ మూడు రోజుల్లో మాత్రమే సుమారు రూ. 543 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి విశాఖపట్నం జిల్లా డిసెంబర్ నెలలో అత్యధికంగా సుమారు రూ. 178.6 కోట్లు అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

