ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ఈ నెల 2న ప్రారంభంకానున్నాయి. ప్రధాని మోదీ అమరావతి పనులతో పాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మరో కొత్త మాల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి కేంద్రం యూనిటీ మాల్‌ను ఏపీకి మంజూరు చేసింది. ఈ మాల్‌ను విశాఖలోని మధురవాడలో రూ.172 కోట్లతో నిర్మిస్తారు.

