ఏలూరు ఏజెన్సీలో సుమారు 70 రోజుల క్రితం భారీ ఆపరేషన్ చేపట్టి బంధించిన రెస్క్యూ టీమ్ పులిని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే, ఇప్పుడు అదే పులి మళ్లీ జనారణ్యంలోకి ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ పులి కదలికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. పగటిపూట వెదురు పొదల్లో సేదతీరుతూ ‘రెస్ట్’ తీసుకుంటున్న పులి, రాత్రి వేళల్లో అటవీ మార్గాల గుండా ప్రయాణిస్తోంది. తాజాగా పోలవరం జిల్లా మంటూరు వద్ద గోదావరి దాటిన పులి, వాడపల్లి-కొత్తూరు ప్రాంతంలోకి ప్రవేశించింది.

