ప్రీలాంచ్, అధిక వడ్డీ తదితర హామీలతో 500మంది వద్ద వందల కోట్లు వసూలు చేసిన ఎవి ఇన్ఫ్రా కంపెనీపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ మోసం కావడంతో కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు విక్రయిస్తానని చెప్పడంతో దాదాపుగా 500మంది బాధితులు రూ.10లక్షలు నుంచి కోటి రూపాయల వరకు డిపాజిట్ చేశారు. బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. విజయ్ గోగుల కాల్ డేటా, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

