పశ్చిమాసియాలో అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ‘అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం జీసస్, అల్లా మధ్య జరిగే ఫైట్ లాంటిది. ఇందులో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారిపోతా” అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

