నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే నిరాకరించారు. ఈ కేసు ప్రైవేట్ ఫిర్యాదు నుంచి వచ్చిందనీ.. మనీలాండరింగ్ చట్టం (PMLA) కింద కేసు నమోదు చేయడానికి అవసరమైన ప్రిడికేట్ ఆఫెన్స్ లేకుండా ఉందని కోర్టు తెలిపింది. ఫలితంగా ఈడీ ఫిర్యాదును జడ్జి కొట్టివేశారు.

