ధురంధర్-ది రివెంజ్ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా దాదాపు 4 గంటల నిడివితో ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి.. అంత సేపు సినిమా తీసి.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండేలా చేయడం అంటే మామూలు విషయం కాదని.. అందుకు ఎంతో గట్స్ ఉండాలని ప్రశంసించారు. రచన, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం, మ్యూజిక్ ఇలా వేటిలోనూ లోపాలు కనిపించలేదు అని రాజమౌళి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

