ఐటీ కారిడార్‌లోని గండిపేట పరిసరాల్లో ఉన్న ప్రతిష్ఠాత్మక సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఉదయం రన్నింగ్‌కు వెళ్లిన ఓ యువతికి ఓ వ్యక్తి నుండి వికృత వేధింపులు ఎదురయ్యాయి. ఉదయం 6:15 గంటల సమయంలో.. ట్రాక్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆమెను చూస్తూ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. సెల్ ఫోన్ కెమెరా ఓపెన్ చేసేలోపే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడని.. లేదంటే వాడి ముఖాన్ని ప్రపంచానికి చూపించేదాన్నని ఆమె ఆ వీడియోలో వెల్లడించింది.

