రైలులో ప్రయాణించే వారు నిర్ణీత పరిమితికి మించి సామాను తీసుకువస్తే ఇక తప్పనిసరిగా అదనపు చార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోలు, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోలు, ఏసీ 3 టైర్, చైర్ కార్లో కూడా 40కిలోలు, ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోలు, ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు అత్యధికంగా 70 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఉంది.

