
బిహార్ విపక్ష ఇండియా (మహా ఘట్బంధన్) కూటమిలో చీలిక ఏర్పడింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ సీట్లను పంచుకునే అంశంలో కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయాయి. పర్యవసానంగా 10 సీట్లలో విపక్ష పార్టీలు కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమకు ఇష్టమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. నాలుగు చోట్ల ఆర్జేడీని మిత్రపక్షం కాంగ్రెస్ ఢీకొంటోంది. మరో నాలుగు చోట్ల మిత్రపక్షం సీపీఐకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇంకో రెండు చోట్ల ఆర్జేడీతో మిత్రపక్షం వీఐపీ తలపడుతోంది.