రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు ముంబైలో జరుగుతున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు ముంబైలోని బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ స్టార్స్ హాజరవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. ముంబై, వర్లీలోని నెహ్రూ సెంటర్లో నిర్వహించిన వేడుకలకు హాజరైన బాలీవుడ్ స్టార్స్ ఆరెస్సెస్ నేతలతో కలిసి చర్చిస్తూ కనిపించారు. శని, ఆదివారాల్లో జరిగిన వేడుకలకు బాలీవుడ్ మొత్తం హాజరైనట్లు కనిపించింది.

