పంజాబ్‌కు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి పదవి కోసం రూ.500 కోట్లు ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై డీకే స్పందిస్తూ ‘ఆమెను మంచి మానసిక ఆసుపత్రిలో చేర్చాలి’ అన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చినవారు మాత్రమే సీఎం అవుతారనడంలో అర్థం లేదన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలల్లో నిజం లేదన్నారు.

