ఆంగ్లంలో మాట్లాడడాన్ని భవిష్యత్లో సిగ్గుచేటుగా భావిస్తారని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్షనేత రాహుల్ గాంధీ సహా పలువురు విరుచుకుపడ్డారు. ఇంగ్లీషు భాష ఆటంకం కాదని.. అదొక వంతెన, మన చేతిలో ఆయుధం లాంటిందని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి చిన్నారిని సమాన హక్కులు కల్పించిందేకు బిజెపి, ఆర్ఎస్ఎస్ బద్ధ వ్యతిరేకులని రాహుల్ మండిపడ్డారు. పేదల సాధికారతను ఒప్పుకోరని, అదే జరిగితే వాళ్లు ప్రశ్నిస్తారని వాళ్ల భయమని దుయ్యబట్టారు.

