కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాగాంధీకి వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కారణంగా అప్పుడప్పుడు చెకప్‌ల కోసం ఆస్పత్రికి వెళ్తుంటారని తెలిసింది.

