అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. తన స్టోర్‌లో దోపిడీకి యత్నించిన దుండగుడిని.. ధైర్యంగా ఎదిరించిన భారత సంతతికి చెందిన మహిళను.. వెంబడించి మరీ అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ దారుణ సంఘటన యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్‌లో చోటుచేసుకుంది. మృతురాలు గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌గా గుర్తించారు. దోపిడీ చేయడానికి వచ్చిన అతన్ని కిరణ్ పటేల్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒక వస్తువును అతనిపై విసిరి, స్టోర్ బయటికి పరుగెత్తారు. కోపంతో ఉన్న దుండగుడు ఆమెను వెంబడించి కాల్పులు జరిపాడు.

