పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న ఆశలపై ఇరాన్ నీళ్లు చల్లింది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రసక్తే లేదని తాజాగా స్పష్టం చేసింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత స్థాయి నేతల బృందాన్ని పాకిస్థాన్‌కు పంపుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ సంచలన ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. “అమెరికాకు దౌత్యంపై కనీస సీరియస్‌నెస్ లేదు. బెదిరింపులకు దిగుతూ చర్చలకు పిలవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం” ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అని విమర్శించారు.

