ఏయూ నుంచి వచ్చిన అనేక మంది భిన్న రంగాల్లో రాణించారని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. విశాఖలో నిర్వహించిన ఏయూ శతాబ్ది మహోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. “మా నాన్న కూడా ప్రొఫెసర్.
ఆయన సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చారు. కేవలం రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవాళ్లం. క్రీడాకారుడిగా నిలదొక్కుకున్నాకే కారు కొనుక్కున్నాను. నెట్స్‌లో ఎంతో సాధన చేయడం వల్లే క్రికెట్లో రాణించాను. లక్ష్యం చేరుకునే క్రమంలో మనసులో అనేక అనుమానాలు వస్తాయి. ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసమే ఆయుధం” అని పేర్కొన్నారు.

