అయతొల్లా అలీ ఖమేనీ ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ సీరియస్ అయ్యింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలను తానే కాపాడానని, అయినా అతడు కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ‘ట్రంప్ నిజంగా మాతో అణు ఒప్పందాన్ని కోరుకుంటుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మర్యాదగా సంబోధించాలి. ఖమేనీ పట్ల అగౌరవకరమైన, ఆమోదయోగ్యం కాని స్వరాన్ని పక్కన పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.

