మద్రాస్ హై కోర్టు అఖండ 2 రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుతున్న సమాచారం మేరకు అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు, బయ్యర్ల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది.
ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయి కాబట్టి నిర్మాతలు మరోసారి అదనపు టికెట్ ధరల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. 11 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు కూడా ప్లాన్ చేస్తున్నారు.

