నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరబోతున్నారనే ఉత్కంఠకు తెర పడింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన ఆయన నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కమలం పార్టీ కండువా కప్పి అధికారికంగా గువ్వల బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని బాలరాజు తెలిపారు. అందుకే ఆయన ఈ పార్టీని ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు.

