
తెలంగాణలో అందాల పోటీల హడావుడి ప్రారంభమైంది పలు దేశాల అందగత్తెలు హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు కెనడా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మిస్ కెనడా క్యాథరన్ మోరిసన్‌కు ఘనస్వాగతం లభించింది. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుట బొట్టుపెట్టి, మెడలో పూలమాల వేసి ఆహ్వానించారు.
- 0 Comments
- Hyderabad