కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి ఒక కంపెనీ అమాయక ప్రజలను నిండా ముంచేసింది. 25 నుంచి 30 శాతం వరకు వడ్డీ వస్తుందని కస్టమర్లను నమ్మించేందుకు మొదట అధిక వడ్డిలు ఇచ్చారు. గత ఆరు నెలల నుంచి పూర్తిగా లావాదేలు ఆగిపోయాయి. రాజకీయ పార్టీకి చెందిన నేతలు, పోలీసు అధికారులు అందరూ.. ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. కానీ ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.

