నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే మైసా నుంచి కొత్త పోస్టర్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుండగా.. తాజాగా రణబాలి సినిమాలో రష్మిక పోషిస్తున్న ‘జయమ్మ’ పాత్రకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్ను విడుదల చేసింది.

