
హైదరాబాద్ నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు పూర్తిగా తీరిపోనున్నాయి. ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌ను 15 అంతస్తులు మేర, దేశంలో ఇదే మొట్ట మొదటి అతిపెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు రూ.80 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ప్రాజెక్టును నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఆ కాంప్లెక్స్‌ను రూపొందిచారు
- 0 Comments
- Hyderabad