మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ రోడ్డులో పోలీసులు తాజాగా ఒక భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. పక్కా సమాచారంతో జరిపిన ఈ దాడిలో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి, సుమారు రూ.4.5 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద తనిఖీలు చేయగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన డ్రగ్స్ బయటపడ్డాయి. సుమారు 920 గ్రాముల వీడ్ ఆయిల్ (హ్యాష్ ఆయిల్) స్వాధీనం చేసుకున్నారు

