
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రజలకు అనేక రకాల పౌర సేవలను సులభంగా అందించేందుకు ‘మైజీహెచ్ఎంసీ’ అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజినీరింగ్ సంబంధిత పనులు, ప్రజారోగ్య సమస్యలు, వీధి దీపాల నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ సమస్యలు, రహదారుల శుభ్రత వంటి అనేక అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చునన్నారు.
- 0 Comments
- Hyderabad