
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఎల్అండ్టీ స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రం ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న మూడు కారిడార్లలో ఒక్కటి కూడా లాభాల్లో లేనట్టు తెలిపింది. ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికే సరిపోతుందని, ఆపరేషన్ల ఖర్చులను మించిన ఆదాయం రాకపోవడం వల్ల , 2020 నాటికి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం,అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఫండింగ్ కూడా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని పేర్కొంది.